Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని ఉమ కేసులో కీలక మలుపు

అమరావతి: మాజీమంత్రి దేవినేని ఉమ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఉమ తరపు న్యాయవాదులు ఆయన బెయిల్ కోసం వేసిన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. హత్యయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన దేవినేని ఉమను పోలీసులు మూడు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉమ తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ ఇవ్వాలని గురువారం సాయంత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. తమ వద్ద రికార్డులు లేవని తెప్పించుకోవాలని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. జి. కొండూరు పోలీస్ స్టేషన్ కేవలం 30 కిలోమీటర్లు దూరంలోనే ఉందని వెంటనే రికార్డులు తెప్పించాలని, సోమవారం వాయిదా వేయాలని ఉమ తరపు న్యయవాదులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో హైకోర్టు సోమవారం నాటికి రికార్డులు తెప్పించాలని మంగళవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. మరోవైపు పోలీసులు దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement
Advertisement