Advertisement
Advertisement
Abn logo
Advertisement

APలో ఖాళీ అవుతున్న ఐటీ కంపెనీలు: దేవినేని ఉమా

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసరపల్లిలో 'బిగ్' ఐటీ టవర్ నిర్మాణ పనులకు బ్రేక్ పడిందన్నారు. 20 వేల మందికి ఉపాధికల్పించేలా టీడీపీ హయాంలోనే 70 శాతానికిపైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ఐటీ కంపెనీలు ఖాళీ అవుతున్నాయని ఆరోపించారు. విధ్వంసాలు, కూల్చివేతలుమాని సంపద సృష్టించే పనులపై ప్రభుత్వం దృష్టి పెడితే అప్పుల కోసం తిప్పలు తప్పేవికదా? అని దేవినేని ఉమా అన్నారు.

Advertisement
Advertisement