Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు: దేవినేని ఉమ

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై వైసీపీ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బహుళార్థసాథక ప్రాజెక్ట్‌ను రూ. 913 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా మార్చారని, లిఫ్ట్ పనులకు సంబంధించిన టెండర్లు ఎవరికి కట్టబెట్టారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 28 నెలల్లో జగన్‌రెడ్డి పోలవరం పనులను ఎంతవరకు చేశారో చెప్పగలరా?.. పోలవరం పనుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బృందం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. టీడీపీ హయాంలోనే పోలవరం పనులు 71 శాతం పూర్తయ్యాయని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement