Abn logo
Aug 2 2020 @ 14:55PM

మాట మార్చి మడమ తిప్పారు: దేవినేని ఉమ

అమరావతి: ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి మద్ధతు పలికారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మడమ తిప్పారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పరిపాలన చేతకాక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఏడాదిలో లక్ష రూపాయలు అప్పులు చేసి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న ఓ మంత్రి రాజధాని భవనాలు గ్రాఫిక్స్ అన్నారని, భవనాలు ఎక్కి దూకితే మంత్రికి నిజం తెలుస్తుంద్నారు. 


నల్ల బిల్లులు న్యాయ సమీక్షకు నిలబడవని రాజ్యం, రాజ్యాంగం గొప్పదని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్నారు. రైతులు, మహిళలది ధర్మపోరాటమని, ఈ న్యాయపోరాటంలో న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మనోనిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో రైతులు పోరాడాలని పిలుపు ఇచ్చారు. కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు, మహిళలు పోరాడుతున్నారని, 70 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదని మండిపడ్డారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5 కోట్ల మంది ప్రజల సమస్యని దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.

Advertisement
Advertisement
Advertisement