ఔదార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-10-21T17:47:02+05:30 IST

అమరావతి: సాయం పొందాలంటే వారం పాటు ముంపులో మునగాలన్న నిబంధనను ఏ ప్రభుత్వమైనా పెడుతోందా?

ఔదార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా?: దేవినేని ఉమ

అమరావతి: సాయం పొందాలంటే వారం పాటు ముంపులో మునగాలన్న నిబంధనను ఏ ప్రభుత్వమైనా పెడుతోందా? అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔదార్యం చూపాల్సిన చోట షరతులేంటంటూ మండిపడ్డారు. అపార నష్టానికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అంటూ దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ‘‘సాయం పొందాలంటే వారం ముంపులో మునగాలన్న నిబంధన.. ఏ ప్రభుత్వమైనా పెడుతుందా? ఔదార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా? అపార నష్టానికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకుంటారా? మంత్రులను బాధితులు నిలదీస్తున్నారని, సీఎం గాల్లో ప్రదక్షిణలు చేస్తున్నారని.. చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి జగన్‌రెడ్డి’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.


Updated Date - 2020-10-21T17:47:02+05:30 IST