Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్ పిటిషన్

అమరావతి: హైకోర్టులో మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులను పోలీసులు మోపారు. ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. ఉమాపైనే దాడి చేసి ఆయనపైనే కేసులు నమోదుచేయటంపై అభ్యంతరం తెలిపారు. పలు సాంకేతిక ఆధారాలను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంది. రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.


గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌ దాసరి సురేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమా, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీకి చెందిన ఆరుగురిపైనా కేసులు పెట్టామని చెబుతున్నప్పటికీ.. వారి పేర్లను వెల్లడించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement