Abn logo
Aug 16 2021 @ 18:45PM

జగన్ లేడు.. గన్ లేదు: దేవినేని

అమరావతి: జగన్.. గన్ అన్నారు, గన్ ఎక్కడ జగన్ ఎక్కడ, జగన్ లేడు గన్ లేదు, దిశ యాప్, అన్నారు.. చట్టాలు అన్నారు ఇవన్ని ఏమయాయి అని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. సోమవారం దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ..స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉన్న ప్రాంతంలో రమ్య ఘటన జరిగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో దాడులు జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ఇలాంటి ఘటనలు జరిగేవా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి అసమర్థత వల్లే జరుగుతున్నాయని దుయ్యబట్టారు. రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరామర్శకు వచ్చిన నారా లోకేష్, ఆయనతో పాటు వచ్చిన నాయకులను పోలీసుల అనుమతి ఇచ్చి ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైలవరం మహిళ హత్య జరిగితే పట్టించుకూనే వారు లేరన్నారు. హత్య జరిగిన 12 గంటల తర్వాత ట్విట్టర్‌లో స్పందిస్తారా ,,సిగ్గుందా అని దేవినేని ఉమ ధ్వజమెత్తారు.