Advertisement
Advertisement
Abn logo
Advertisement

బూతులు మాట్లాడటం తప్ప ప్రజలకు చేసింది శూన్యం: దేవినేని ఉమ

కృష్ణా: పామర్రు నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యులు వర్ల కుమార్ రాజాకు అండగా నిలవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల జేబులకు నవ రంధ్రాలు పెడుతున్నారని విమర్శించారు. దద్దమ్మ అసమర్థ, చేతగాని వైసీపీ ప్రభుత్వ పాలన వల్లనే రాష్ట్ర ప్రజలకు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. మంత్రులు బూతులు మాట్లాడటం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. పరిపాలన చేత కాక ముఖ్యమంత్రి జగన్ చతికిల పడ్డాడని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ దోచుకున్న అవినీతి సొమ్మును, దేశంలో పది చోట్ల దాచుకున్నాడని ఆరోపించారు.


 పామర్రు మండలం నిమ్మకూరులో సందడి వాతావరణంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా వర్ల కుమార్ రాజా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement