Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఐడీ నోటీసులపై హైకోర్టులో దేవినేని పిటిషన్‌

అమరావతి: సీఐడీ అధికారుల నోటీసులపై హైకోర్టులో దేవినేని ఉమ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని, సీఐడీ నోటీసులను రద్దు చేయాలని పిటిషన్‌లో దేవినేని ఉమ కోరారు. సీఎం మార్ఫింగ్‌ వీడియో ప్రదర్శించారని దేవినేని ఉమకు సీఐడీ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. 


ఇక ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. మంగళవారం  గొల్లపూడిలోని దేవినేని ఉమ ఇంటికి వెళ్లారు. అధికారులు వెళ్లే సమయానికి దేవినేని ఉమ ఇంట్లో లేరు.  దీంతో కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నోటీస్ జారీ చేయడం జరిగిందని.. అది తమకు తెలుసా అని దేవినేని కుటుంబ సభ్యులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 19వ తేదీనే కర్నూల్ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి దేవినేని ఉమ హాజరు కావాల్సి ఉంది. హాజరుకాకపోవడంతోనే దేవినేని ఉమ ఇంటికి వెళ్లినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement