దేవిప్రియ మృతి సాహితీ రంగానికి తీరని లోటు

ABN , First Publish Date - 2020-11-23T05:46:37+05:30 IST

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని ప్రజ్వలిత సంస్థ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్‌ అన్నారు.

దేవిప్రియ మృతి సాహితీ రంగానికి తీరని లోటు
దేవిప్రియకు సంతాపం తెలుపుతున్న ప్రజ్వలిత కుటుంబసభ్యులు

తెనాలి టౌన్‌, నవంబరు 22 : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని ప్రజ్వలిత సంస్థ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఉదయం సంస్థ కార్యాలయంలో దేవిప్రియ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దేవిప్రియ రాసిన పాటలు, కథలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు జనాకర్షణ కలిగిన సాహిత్యంగా పేరొందాయన్నారు. గాలిరంగు కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించడం ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గంజి దుర్గాప్రసాద్‌, రామలింగేశ్వరుడు, కన్నెగంటి మధు, దేవిశెట్టి కృష్ణారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-23T05:46:37+05:30 IST