Abn logo
Dec 4 2020 @ 01:07AM

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి

ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ 

భూత్కూర్‌ బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

దస్తూరాబాద్‌, డిసెంబరు 3 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మండలంలోని భూత్కూర్‌ గ్రామానికి బీటీరోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మె ల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో ఎన్ని కల ప్రచారంలో భూత్కూర్‌ రోడ్డుకు బీటీ రోడ్డును మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు బీటీ రోడ్డు మంజూరు చేయించి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ బీటీ రోడ్డు వల్ల గొడిసిర్యాల్‌, రాంపూర్‌, గోండుగూడ గ్రామాలకు సౌకర్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మండలంలోని దేవునిగూడెం, రేవోజీపేట్‌ తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కన్నే శంకర్‌, ఎంపీపీ కిషన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ఐలయ్య, సుధాకర్‌, తహసీల్దార్‌ విశ్వం బర్‌, నాయకులు రమేష్‌ రావు, శ్రీనివాస్‌, సత్తన్న, ప్రభాకర్‌, భూమన్న, సంతోష్‌, శివయ్య, రాయలింగు, అంజన్న, రాజు, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు. 

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెంబి, డిసెంబరు 3 : మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ గురువారం ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించాలని కోరారు. 

అనంతరం నాగపూర్‌ గ్రామానికి చెందిన బోసు నారాయణకు మంజూరైన 28 వేల సీఎం సహయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భుక్య కవిత గోవింద్‌, జడ్పీటీసీ జాను బాయి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్‌, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ గంగారెడ్డి, ఉప సర్పంచ్‌ స్వప్నిల్‌, నాయకులు విలాస్‌, కుర్మ రాజేందర్‌, గంగాధర్‌, సుధాకర్‌, నరేందర్‌, శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement