డెవాన్‌ ధనాధన్‌

ABN , First Publish Date - 2021-02-23T09:21:52+05:30 IST

డెవాన్‌ కాన్వే.. 29 ఏళ్ల ఈ న్యూజిలాండ్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రూ.50 లక్షల ప్రారంభ ధరతో నాలుగు..

డెవాన్‌ ధనాధన్‌

తొలి టీ20లో కివీస్‌ గెలుపు


క్రైస్ట్‌చర్చ్‌: డెవాన్‌ కాన్వే.. 29 ఏళ్ల ఈ న్యూజిలాండ్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రూ.50 లక్షల ప్రారంభ ధరతో నాలుగు రోజుల కిందట జరిగిన ఐపీఎల్‌ వేలంలో నిలిచాడు. అప్పటికి పెద్దగా తెలియని ఇతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దాంతో అమ్ముడుపోని కసితో ఉన్నాడేమో..సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో కాన్వే అజేయంగా 99 (59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్‌ చేశాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 53 రన్స్‌తో నెగ్గింది. తొలుత కివీస్‌ 20 ఓవర్లలో 184/5 స్కోరు చేసింది. 11/2 స్కోరుతో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన డెవాన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం ఇష్‌ సోధి (4/28) దెబ్బకు ఆస్ట్రేలియా 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. 


కాన్వే చివరి ఐదు ఇన్నింగ్స్‌ స్కోర్లు :

99 నాటౌట్‌, 93 నాటౌట్‌, 91 నాటౌట్‌, 69 నాటౌట్‌, 50.


4 రోజులు ఆలస్యమైంది..

డెవాన్‌ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన భారత స్పిన్నర్‌ అశ్విన్‌ ‘ఏం ఆడావ్‌’ అని ట్విటర్‌లో అతడిని ప్రశంసించాడు. నాలుగు రోజులు ఆలస్యమైందని ఐపీఎల్‌ వేలంలో కాన్వే అమ్ముడు కాకపోవడానుద్దేశించి వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2021-02-23T09:21:52+05:30 IST