అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త

ABN , First Publish Date - 2020-12-03T15:17:37+05:30 IST

కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది.

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త

శబరిమల: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో అయ్యప్పను దర్శించుకునేందుకు మూడువేల మంది భక్తులకు అనుమతి ఇచ్చింది. మిగతారోజుల్లో ప్రతిరోజు 2వేల మంది భక్తులకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు సాధారణ రోజుల్లో రోజకు వెయ్యి మంది, శని, ఆది వారాల్లో రోజుకు 2వేల మంది భక్తులను దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-03T15:17:37+05:30 IST