యాదాద్రి క్షేత్రానికి తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-24T01:49:50+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవురోజు కావడంతో సాధారణంగా ఆలయం ప్రాంగణంతోపాటు

యాదాద్రి క్షేత్రానికి తగ్గిన భక్తుల రద్దీ

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవురోజు కావడంతో సాధారణంగా ఆలయం ప్రాంగణంతోపాటు బాలాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో భక్తుల సందడి అంతగా కనిపించలేదు. ఆలయ తీరువీధులు, కొండపై ప్రాంతాలు బోసిబోయాయి. కరోనా విజృంభనకు ముందు ఆదివారం 30వేల నుంచి 35వేల మంది భక్తులు హాజరుకాగా, కరోనా భయంతో ఆదివారం రోజు 15వేల లోపు భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సాధారణంగా ఆలయ ఖజానాకు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆదాయం సమకూరగా, ఆదివారం మాత్రం రూ.13.11లక్షల ఆదాయం మాత్రమే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

Updated Date - 2022-01-24T01:49:50+05:30 IST