Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆధ్యాత్మికం..ఆనందం

కిటకిటలాడిన ఆలయాలు 

రావి వేప చెట్లకు కల్యాణాలు 

పంచారామాల్లో కార్తీక దీపోత్సవాలు


ఆకివీడు/ మొగల్తూరు/వీరవాసరం, డిసెంబరు 2 : ఆధ్యాత్మికతకు ప్రతీక కార్తీకమాసమని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు అన్నా రు. వాడపల్లి బ్రదర్స్‌, సోము కాశీ విశ్వనాథం నేతృత్వంలో గురువారం  పార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆల యంలో రుధ్రాభిషేకం,నవగ్రహ మృత్యుంజయ హోమం, లక్ష్మీనారాయణ (రావి–వేపచెట్ల)కు శాంతి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, ఏఎంసీ చైర్మన్‌ ఎండీ మస్తాన్‌వలీ, ఎంపీపీ కఠారి జయలక్ష్మి, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ పుప్పాల పండు దర్శిం చుకున్నారు.అనంతరం అఖండ అన్నసమారాధన చేశారు.మొగల్తూరు మండ లం కెపిపాలెం సౌత్‌ గ్రామంలో అందే వెంకట కృష్ణ నాగమణి దంపతులు లక్ష్మీనారాయణుడి కల్యాణాన్ని గురువారం జరింపించారు. వీరవాసరం, పంజావేమవరం సాయినాథుడి ఆలయాల వద్ద కార్తీకవనసమారాధనలు జరిపారు. తూర్పుచెరువుగట్టున ఉన్న సువర్చలా సమేత సంజీవ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి వనసమారాధన జరిపారు. 


ఆలయాల్లో ధన్వంతరీ హోమాలు..


కాళ్ళ/పాలకొల్లు అర్బన్‌/భీమవరం టౌన్‌, డిసెంబరు 2 : కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా కాళ్ళ మండలం కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి,  పాల కొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి, శంభేశ్వరస్వామి, భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వర స్వామి, మావుళ్ళమ్మ, గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయాల్లో గురువారం ధన్వంతరి హోమం, ఆయుష్‌ హోమం నిర్వహించారు.ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు.ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 


వెలుగు పంచిన.. కార్తీక దీపోత్సవాలు..


భీమవరంటౌన్‌/పెనుమంట్ర, డిసెంబరు 2 : కార్తీకమాసం త్రయోదశి సదర్బంగా పంచారామ క్షేత్రమైన గునుపూడిలోని సోమేశ్వరస్వామి ఆలయంలో నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ ఆరు బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జనార్దన సోమేశ్వర, పార్వతీ అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చ కులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ పూజలు చేయించారు.ఎమ్మెల్యే గ్రంఽధి శ్రీనివాస్‌ దీపోత్సవాన్ని ప్రారంభించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష వత్తుల దీపారాధన చేశారు. జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.   పెనుమంట్ర మండలం పొలమూరు పార్వతీ మార్కండేయేశ్వర స్వామి దేవస్ధానంలో భక్తుల సహకారంతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ప్రదోషకాల పూజలను నిర్వహించిన అనంతరం ఆల యంలో వివిధ ఆకృతుల్లో ఏర్పాటుచేసి దీపాలను భక్తులు వెలిగించారు.  వీరవాసరం మండలం రాయకుదురు ఉమామూలేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి సహస్ర దీపాలంకరణ పూజలు నిర్వహించారు. 


లక్ష రుద్రాక్ష పూజలు.. 


పెనుమంట్ర/పాలకోడేరు, డిసెంబరు 2 : పెనుమంట్ర మండలం జుత్తిగ ఉమావాసుకీ రవి సోమేశ్వర స్వామికి గురువారం లక్ష రుద్రాక్షలతో పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఏకాదశ రుద్రాబిషేకాలు నిర్వహించారు. పార్వతీ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల వద్ద అయ్యప్పస్వామి, భవానీ భక్తుల ఆధ్వర్యంలో రుద్రాక్ష పూజలను ఘనంగా నిర్వహించారు.  

పాలకొల్లు క్షీరారామంలో లక్ష ఒత్తుల దీపాలు వెలిగిస్తున్న భక్తజనం


Advertisement
Advertisement