భక్తజన సందోహం

ABN , First Publish Date - 2021-11-30T05:13:12+05:30 IST

భక్తజన సందోహం

భక్తజన సందోహం


  •  కార్తీక చివరి సోమవారం... కీసరగుట్టలో భక్తుల రద్దీ  
  •  స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు 
  •  చక్రస్నానంతో ముగిసిన అనంతగిరి పెద్దజాతర


కీసర:  కీసరగుట్ట క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడింది. కార్తీక మాసోత్సవం సందర్భంగా  చివరి సోమవారం భక్తులు అధిక సంఖ్యల్లో విచ్ఛేసి స్వామివారిని దర్శించుకున్నారు.  అర్చకులు  తెల్లవారుజామున 3.30 గంటలకే స్వామివారికి శీర ఫలారసాభిషేకం, శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. 5 గంటల తర్వాత భక్తులు అనుమతించారు. పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవంలో భాగంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు శ్రీ రామలింగేశ్వరుడిని  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆనంతరం ఆలయ చైర్మన్‌ తటాకం నాగలింగం శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి రాజుకు ఘనంగా సన్మానించి, శాలువతో సత్కారించగా, అర్చకులు స్వామివారి ఆశీర్వచనలు అందజేశారు.కాగా కీసర మండల పరిధిలోని కరీంగూడ గ్రామంలో శ్రీ కృష్ణ ఆలయానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు కొంపల్లి మోహన్‌రెడ్డి, విక్రంరెడ్డి పాల్గొన్నారు. 

 పద్మనాభుడికి చక్రస్నానం

వికారాబాద్‌:కార్తీక మాసం అనంత పద్మనాభస్వామి పెద్ద జాతర  స్వామివారి చక్రస్నానంతో ముగిసింది.  సోమవారం స్వామి వారిని అర్చకులు, భక్తులు ఆలయం నుంచి పుష్కరిణి వరకు పల్లకిపై ఊరేగించి పుష్కరిణిలో చక్రస్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చక్రస్నానం పూజలో ఆలయ అర్చకులు సీహెచ్‌ శేషగిరిచారి, అనంతగిరి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా జాతర హుండీ డిసెంబర్‌ 7వ తేదీ మంగళవారం ఉదయం 10గంటలకు లెక్కించనున్నట్లు ఈవో నరేందర్‌ తెలిపారు. 11 రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు వికారాబాద్‌ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-11-30T05:13:12+05:30 IST