కరోనా బారినపడి కోలుకున్న వారి ఎంట్రీపై కువైత్ కొత్త కండిషన్స్..!

ABN , First Publish Date - 2022-01-12T14:24:39+05:30 IST

కువైత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని విమానయాన సంస్థలకు కరోనా నేపథ్యంలో తాజాగా కొత్త సర్క్యులర్ జారీ చేసింది.

కరోనా బారినపడి కోలుకున్న వారి ఎంట్రీపై కువైత్ కొత్త కండిషన్స్..!

కువైత్ సిటీ: కువైత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని విమానయాన సంస్థలకు కరోనా నేపథ్యంలో తాజాగా కొత్త సర్క్యులర్ జారీ చేసింది. కువైత్ బయట కరోనా బారిన పడి కోలుకోవడంతో పాటు ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్న వారు తిరిగి దేశంలో ప్రవేశానికి సంబంధించిన కొత్త కండిషన్స్‌ను ఈ సర్క్యులర్‌లో వెల్లడించింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తైన వారు, అసలు టీకా వేసుకోని వారికి వేర్వేరుగా షరతులు విధించింది. 

* వ్యాక్సిన్ తీసుకుని, కరోనా బారిన పడి కోలుకున్నవారు.. కువైత్ రావడానికి ముందు

(7 నుండి 28 రోజులు) వ్యవధిలో పీసీఆర్ టెస్టు పాజిటివ్ రిపోర్టు సమర్పించాలి.

* టీకా తీసుకోని, కరోనా బారిన పడి కోలుకున్నవారు.. కువైత్‌కు వచ్చే తేదీకి ముందు (10 నుండి 28 రోజులు) వ్యవధిలో పీసీఆర్ టెస్టు పాజిటివ్ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.


ఈ కొత్త నిబంధన బుధవారం(జనవరి 12) నుంచి అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా డీజీసీఏ స్పష్టం చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోకి ప్రవేశించే ప్రయాణికుల విషయమై ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మంత్రిమండలి నిర్ణయం మేరకు ఈ కొత్త షరతులు అమలు చేస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. 


Updated Date - 2022-01-12T14:24:39+05:30 IST