SpiceJet లైసెన్స్ నిలిపివేత...డీజీసీఏ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-10-16T13:35:54+05:30 IST

ప్రమాదకరమైన వస్తువుల రవాణా చేసిన స్పైస్ జెట్ లైసెన్స్‌ను విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) తాత్కాలికంగా నిలిపివేసింది.

SpiceJet లైసెన్స్ నిలిపివేత...డీజీసీఏ సంచలన నిర్ణయం

ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లినందుకు... 

ముంబై : ప్రమాదకరమైన వస్తువుల రవాణా చేసిన స్పైస్ జెట్ లైసెన్స్‌ను విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) తాత్కాలికంగా నిలిపివేసింది.ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళ్లిన స్పైస్‌జెట్ లైసెన్స్‌ను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది. స్పైస్ జెట్ తన దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించమని డీజీసీఏ తెలిపింది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం, ప్రమాదకరమైన వస్తువులు ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ఆర్టికల్స్ లేదా పదార్థాలను విమానాల్లో తీసుకువెళ్లరాదు. ఒక రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడంతో లోపం జరిగిందని, డీజీసీఏ సలహామేర తాము నష్ట నివారణ, దిద్దుబాటు చర్యలు చేపట్టామని స్పైస్ జెట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు.


Updated Date - 2021-10-16T13:35:54+05:30 IST