పోలీస్‌ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: డీజీపీ

ABN , First Publish Date - 2020-10-21T08:31:18+05:30 IST

పోలీసు శాఖలో ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రాష్ట్రంలో 101 మంది పోలీసులు కొవిడ్‌తో

పోలీస్‌ సంక్షేమానికి  అధిక ప్రాధాన్యం: డీజీపీ

విజయవాడ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రాష్ట్రంలో 101 మంది పోలీసులు కొవిడ్‌తో మరణించారని, మొత్తం 13,229 మంది వైరస్‌ బారిన పడ్డారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నుంచి నిరంతరంగా విధుల్లో ఉన్న పోలీసులకు ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు. జీవన్‌ జ్యోతి బీమా, సురక్ష బీమా స్కీమ్‌లకు సంబంధించి ఎస్‌బీఐతో ఎంవోయూ కుదిరిందని, ప్రమాద పాలసీ రూ.40లక్షలు, సహజ మరణానికి రూ.3లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గందని చెప్పారు. 2016 నుంచి ఇప్పటి వరకు 18శాతం నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ తెలిపారు. 

Updated Date - 2020-10-21T08:31:18+05:30 IST