Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్షతగాత్రులను రక్షిస్తే నగదు ప్రోత్సాహకాలు

  • రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణకు చర్యలు: డీజీపీ


అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రు లను ఆసుపత్రులకు తరలించిన వారికి నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. కేంద్ర పథకంలో భాగంగా.. రాష్ట్రంలోనూ అక్టోబరు 15 నుంచి అమలు చేస్తున్నామని 2016 మార్చి 31వరకూ అమల్లో ఉంటుంద ని చెప్పారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ కింద పరిగణిస్తారని, ఆసమయంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనిన్నారు. వైద్యుడు, పోలీస్‌ స్టేషన్‌ నుంచి ధ్రువీకరించిన వారికి నగదు ప్రోత్సాహం అందుతుందని, అత్యంత విలువైన మూడు ప్రతిపాదనలను జాతీయస్థాయి కమిటీకి పంపి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పదిమందికి నగదు పురస్కారం కేంద్రం అందిస్తుందని డీజీపీ వివరించారు. రాష్ట్ర, 13 జిల్లాల స్థాయిలో కమిటీల ఏర్పాటుకు ఇటీవలే ఆదేశాలు జారీ చేసినట్లు సవాంగ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement