కొవిడ్‌ పట్ల సిబ్బంది పూర్తి అప్రమత్తం

ABN , First Publish Date - 2021-04-21T05:40:11+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం, సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

కొవిడ్‌ పట్ల సిబ్బంది పూర్తి అప్రమత్తం
వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అస్మీ

అదనపు డీజీపీ వీసీలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ

కాకినాడ క్రైం, ఏప్రిల్‌ 20: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం, సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.  మంగళగిరి నుంచి అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్య భద్రత విషయమై కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన సిబ్బందికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తూ, తగిన విశ్రాంతి కల్పించి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నివారణ కోసం సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయిస్తున్నట్లు అదనపు డీజీపీ రవిశంకర్‌కు ఎస్పీ వివరించారు. వీసీలో అదనపు ఎస్పీ కె.కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రజనీకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:40:11+05:30 IST