రెచ్చగొట్టే విధంగా వార్తలు వస్తున్నాయి: డీజీపీ సవాంగ్

ABN , First Publish Date - 2020-05-28T01:02:54+05:30 IST

మాధ్యమాలు నియంత్రణలో, చట్టపరిధిలో ఉండాలని డీజీపీ సవాంగ్ అన్నారు.

రెచ్చగొట్టే విధంగా వార్తలు వస్తున్నాయి: డీజీపీ సవాంగ్

అమరావతి: మాధ్యమాలు నియంత్రణలో, చట్టపరిధిలో ఉండాలని డీజీపీ సవాంగ్ అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా రెచ్చగొట్టే విధంగా వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో అలజడి చెలరేగుతోందని పేర్కొన్నారు. ఫలితంగా సమాజంలో అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయన్నారు. ఇటువంటి పరిణామాలు సమాజానికి, వ్యవస్థకు మంచిదికాదని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ తరహా వార్తలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. సీఐడీ విభాగంలోని సైబర్ క్రైమ్ వింగ్ సోషల్ మీడియా నేరాల నియంత్రణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపట్ల ఇష్టారీతిన వ్యాఖ్యలు కామెంట్లు చేయటం, వాటిని ఇష్టమొచ్చినట్టు అన్వయించుకోవటం సరికాదన్నారు. వార్తల వక్రీకరణ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వటం, ప్రసారం చేయటం కరెక్ట్ కాదన్నారు. 

Updated Date - 2020-05-28T01:02:54+05:30 IST