Abn logo
Nov 26 2020 @ 14:30PM

శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా చర్యలు: డీజీపీ

హైదరాబాద్‌: నగరంలోని రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్జికల్ స్ట్రయిక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామన్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు.


హైదరాబాద్‌లో చిన్న సంఘటన కూడా జరగకుండ, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండ పోలీస్ శాఖ చర్యలు తీసుకుందని డీజీపీ తెలిపారు. ఆరేళ్లుగా ఒక్క సంఘటన కూడా జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆసరాగా చేసుకుని మత విద్వేషాలు, మత ఘర్షణలు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇలాంటి విద్వంసక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోషయల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తి స్థాయి నిఘా పెట్టిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement