Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 15:46PM

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: డీజీపీ

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానం చేసి వాటి ద్వారా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావారణంలో జరుగుతోందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలు తమ తమ స్థానాల నుంచి బయలుదేరాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో.. పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీని వినియోగించి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీజీపీ చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement