డీజీపీగా కసిరెడ్డి

ABN , First Publish Date - 2022-02-16T07:13:54+05:30 IST

కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాఽథ్‌ రెడ్డి నియమితులయ్యారు. గౌతమ్‌ సవాంగ్‌ను అనూహ్యంగా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనను జీఏడీలో...

డీజీపీగా కసిరెడ్డి

పోలీస్‌ బాస్‌గా ఇంటెలిజెన్స్‌

చీఫ్‌కు అదనపు బాధ్యతలు

జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని

సవాంగ్‌కు ఆదేశం

పోలీస్‌ బాస్‌గా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు 

పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు

కడప జిల్లా నుంచి అత్యున్నత స్థాయికి

జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని సవాంగ్‌కు ఆదేశం


అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాఽథ్‌ రెడ్డి నియమితులయ్యారు. గౌతమ్‌ సవాంగ్‌ను అనూహ్యంగా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనను జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేస్తున్న రాజేంద్రనాథ్‌ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడుకు చెందిన కసిరెడ్డి అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి  ఏపీఆర్‌జేసీలో చదువుకున్నారు. 1992లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఏఎస్పీగా మొదటి  పోస్టింగ్‌ చేశారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల ఎస్పీగా.. కోస్తాంధ్ర, హైదరాబాద్‌ ఐజీగా.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ, డ్రగ్‌ కంట్రోల్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగానూ పనిచేశారు. ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తోపాటు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పోలీసు బలగాల అధిపతి(డీజీపీ)గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించింది. రాజేంద్రనాథ్‌ రెడ్డికి 2026 ఏప్రిల్‌ వరకూ సర్వీస్‌ ఉంది. ఇక 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్‌ సవాంగ్‌ 2019 మే 31న రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. 2023 జూలైలో ఆయన రిటైర్‌ అవుతారు. మంగళవారం సవాంగ్‌, కసిరెడ్డి సీఎంను విడివిడిగా కలిశారు.


యూపీఎ్‌ససీ ద్వారా ఎంపిక..: రాష్ట్ర ప్రభుత్వం డీజీపీలను రెండు పద్ధతుల్లో నియమించుకోవచ్చు. సొంతంగా తాను ఎంపిక చేసుకున్న డీజీపీ ర్యాంకు అధికారిని నేరుగా నియమించుకోవడం లేదా యూపీఎ్‌ససీ ద్వారా! అంటే... ఐదుగురి పేర్లు కేంద్రానికి పంపి... యూపీఎ్‌ససీ ప్రతిపాదించిన ముగ్గురిలో ఒకరిని తుది ఎంపిక చేయాల్సి ఉంటుంది. జగన్‌ ప్రభుత్వం ఈ పద్ధతినే అనుసరిస్తోంది. ప్రస్తుతం ఏపీ కేడర్‌లో పన్నెండు మంది ఐపీఎస్‌ అధికారులు డీజీపీ పోస్టుకు అర్హులు. సీనియారిటీ ప్రకారం వీఎ్‌సకే కౌముది, ఎన్వీ సురేంద్ర బాబు, ఏఆర్‌ అనూరాధ, ద్వారకా తిరుమలరావు, ఏబీ వెంకటేశ్వరరావు, కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌, అంజనా సిన్హా, మహమ్మద్‌ అహ్‌సన్‌ రెజా, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌ కుమార్‌ గుప్తా, పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు. కౌముది, అంజనా సిన్హా కేంద్ర సర్వీసుల్లో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. మిగిలిన వారిలో సురేంద్రబాబుకు 5 నెలలు, అనూరాధకు ఏడాదిన్నర మాత్రమే సర్వీస్‌ ఉంది. మిగిలిన ఐదుగురి పేర్లు యూపీఎ్‌ససీకి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రక్రియ ముగిశాక కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా నియమించనుంది.

Updated Date - 2022-02-16T07:13:54+05:30 IST