దహీ తడ్కా

ABN , First Publish Date - 2020-03-21T14:40:08+05:30 IST

పెరుగులో సన్నని క్లాత్‌తో వడబోసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ వేడి చేసి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి

దహీ తడ్కా

కావలసినవి: పెరుగు - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, కారం - ఒక  టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా,  కొత్తిమీర - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ధనియాలు - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, పుదీనా పొడి - కొద్దిగా.


తయారీ: పెరుగులో సన్నని క్లాత్‌తో వడబోసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ వేడి చేసి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. పసుపు, ఉప్పు, కారం, గరంమసాల, పుదీనాపౌడర్‌ వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. తరువాత ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి వేయాలి. మసాల చిక్కగా అయ్యే వరకు వేగించాలి. చివరగా పెరుగు వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చిని దంచి చల్లాలి. కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి, అన్నం లేదా చపాతీతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-03-21T14:40:08+05:30 IST