ఘనంగా దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌

ABN , First Publish Date - 2021-10-17T04:39:50+05:30 IST

మండలంలోని అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌ను ఘనంగా జరుపుకొన్నారు.

ఘనంగా దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌
వాంకిడిలో నివాళులర్పిస్తున్న మహిళా ఉపాసకులు

వాంకిడి, అక్టోబర్‌ 16: మండలంలోని అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌ను  ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో పంచశీల్‌ పతాకాలను అవిష్క రించారు. అనంతరం అంబేద్కర్‌, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం నాయకులు, రమాబాయి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని ఐనం, బీబ్రా, ఇట్యాల తదితర గ్రామాల్లో శుక్రవారం దమ్మ పరివర్తన దినోత్స వంను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  

సిర్పూర్‌(టి): మండలంలోని డోర్‌పల్లి గ్రామంలో  దమ్మచక్ర పరివర్తన దివాస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సువర్ణ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమాజీ పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలో మాల, నేతకాని మహార్‌ కుటుంబాలు అశోక విజయదశమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నోమాజీ, పెంటయ్య, రామయ్య, వమస్‌, వాసుదేవ్‌, పోశం, కిరణ్‌, తిరుపతి, రవి, తిరుపతమ్మ, లైజాబాయ్‌, అశోక్‌, సంజీవ్‌, కేశవ్‌, జావీద్‌, దేవాజీ, న్యాయవాది కల్యాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల:  దమ్మ చక్రపరివర్తన్‌ దివాస్‌ సందర్భంగా  మండల కేంద్రంలో  శాంతి ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్‌, బుద్ద విహార్‌ అధ్యక్షులు కాశీనాథ్‌, సభ్యులు శంకర్‌, భీంరావు, జీవన్‌దాస్‌, అశోక్‌, ప్రకాష్‌, గోమాజీ  పాల్గొన్నారు. 

జైనూర్‌: మండలకేంద్రంలోని అంబేద్కచౌక్‌లో శుక్రవారం ప్రజలు అశోక విజయదశమిని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పంచశీల జెండాను సర్పంచ్‌ మేస్రం పార్వతిబాయి లక్ష్మీన్‌ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  అంబేద్కర్‌ సంఘం నాయకులు బావుసాహెబ్‌, వెంకటి, కిరణ్‌, సతీష్‌, కాంబ్లే ఆన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:39:50+05:30 IST