Abn logo
Jun 7 2020 @ 12:47PM

ధనుష్ 44 ఖ‌రారు

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో యువనటుడు ధనుష్‌ మళ్లీ నటించ నున్నారు. ధనుష్‌ ప్రస్తుతం కోలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో బిజీగా ఉన్నారు. కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహించిన ‘జగమే తందిరమ్‌’లో ధనుష్‌ నటించారు. ఆ చిత్రం షూటింగ్‌ ఇటీవ లే ముగిసింది. లాక్‌డౌన్‌ తర్వాత ఆ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెలిపారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ‘కర్ణన్‌’ చిత్రంలో ధనుష్‌ నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ధనుష్‌ బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘అంతరంగీ రే’ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీ నరేన్‌ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రంలో నటించేందుకు ధనుష్‌ అంగీకరించారు. ఆ చిత్రం ధనుష్‌ నటించే 43వ చిత్రం అవుతుంది. ఆ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించబోతు న్నారు. ఆ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ధనుష్‌ ఇదివరకే మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించిన ‘యారడీ నీ మోహినీ’, ‘కుట్టి’, ‘ఉత్తమపుత్రన్‌’ చిత్రాల్లో నటించారు. ఆ నేపథ్యంలోనే ధనుష్‌  44వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని మిత్రన్‌ జవహర్‌ దక్కించుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement