Abn logo
Jul 7 2020 @ 12:52PM

ఓటీటీలో ధనుశ్ ద్విభాషా చిత్రం

ధనుశ్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘జ‌గ‌మే తంత్రం’. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌కుడు. వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.శ‌శికాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధ‌నుష్ లుక్ డిఫ‌రెంట్‌గా ఉంది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌డం లేదు. దీంతో మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే ముందు ధ‌నుశ్ ఒప్పుకుంటారో లేదోన‌ని అంద‌రూ భావించారు. కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో  సినిమా విడుద‌ల కావ‌డం గ‌గ‌న‌మైంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాను హోల్డ్ చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని భావించిన ధ‌నుశ్‌.. సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి ఓకే చెప్పారని టాక్‌.త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. ధ‌నుశ్ హీరోగా న‌టిస్తోన్న 40వ చిత్ర‌మిది. 

Advertisement
Advertisement
Advertisement