దసరాకు ధరణీ లేనట్టే

ABN , First Publish Date - 2020-10-24T11:18:16+05:30 IST

భూముల క్రయవిక్ర యాలు, రిజిస్ట్రేషన్‌లు, మ్యూ టేషన్‌లు నిలిచిపోయి దాదాపు 2 నెలలు కావస్తోంది

దసరాకు ధరణీ లేనట్టే

ధరణి పోర్టల్‌ ప్రారంభం వాయిదా 

ఈనెల 29న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

తహసీల్‌ ఆఫీసుల్లో ఏర్పాట్లు పూర్తి


కామారెడ్డి,  అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): భూముల క్రయవిక్ర యాలు, రిజిస్ట్రేషన్‌లు, మ్యూ టేషన్‌లు నిలిచిపోయి దాదాపు 2 నెలలు కావస్తోంది. రెవెన్యూ, రి జిస్ట్రేషన్‌ శాఖలలో అవినీతి, అక్రమా లను నిర్మూలించి అంతా ఆన్‌లైన్‌ వి ధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి ంది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌లను ని లిపివేసింది. వ్యవసాయభూముల రిజిస్ట్రేష న్‌లను తహసీల్దార్‌ కార్యాలయంలో, వ్యవసా యేతర స్థలాల రిజిస్ట్రేషన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాల యాల్లో చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ధరణి పోర్టల్‌ను అందుబాటు లోకి తీసుకురానుంది. ఈ ధరణి పోర్టల్‌ను దస రా రోజు ప్రారంభించాలని, అప్పటి నుంచి భూ ముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ చే పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం దసరా రోజు ప్రారంభించ డం లేదు. ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసా రి ధరణి పోర్టల్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖ రారు చేసింది. అదే రోజు నుంచి ధరణి సేవ లు అందుబాటులోకి రానున్నాయి.


తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు

 దసరా నుంచి ధరణి పోర్టల్‌ సే వలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం మొదట్లో చెప్పడంతో అధికా రులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్‌ ద్వారా వ్యవసా య, వ్యవసా యేతర భూములు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సిద్ధం చేస్తున్నా రు. ప్రజల స్థిరాస్తులకు మరింత భద్రత కల్పిం చాలని, భూముల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు చె క్‌ పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన రెవె న్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసి ందే. ఈ మేరకు ప్రజలు ఆస్తులన్నీ ఇక ఆన్‌లైన్‌ లో నమోదు కానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ ప్రభుత్వం పలు మార్పులు చే సింది. ఒకే దగ్గర భూ రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యూ టేషన్‌ (పేరు మార్పిడి) జరిగేలా చూడనుంది. ఇది వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూము ల సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే జరిగేవి. పా రదర్శకత, స్నేహపూర్వక రెవెన్యూ సేవలందించా లనే ఉద్దేశంతో ఇక నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో వ్యవసాయేతర భూములు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ధరణి పోర్ట ల్‌ పేరిట వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకొచ్చిం ది. ఇప్పటికే అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలకు అవసరమైన సామగ్రిని పంపించింది.

 

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లుగా తహసీల్దార్లు

ఉమ్మడి జిల్లాలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో ని అధికారులు, సిబ్బందికి పోర్టల్‌ నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. నయాబ్‌ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు, కంప్యూటర్‌ ఆపరేటర్లు క లిపి ఒక్కో మండలంలో నలుగురికి శిక్షణ ఇచ్చిం ది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు అన్ని పత్రాలు పరిశీలించాక మ్యూటేష న్‌ చేసే అధికారం కూడా తహసీల్దా ర్లకే ప్రభుత్వం కల్పించింది. వీరు ఇక జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారనున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ విధా నాన్ని ప్రవేశపెట్టనున్నారు. భూమి రిజిస్ట్రేషన్‌ చే సుకునే రైతు ముందుగా ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ఇంగ్గిష్‌, తెలుగు భాషల్లో వెబ్‌సైట్‌ను పొందుపరిచారు. కొనుగోలు చేసిన భూమి ఏ తహసీల్దార్‌ కార్యాల యం పరిధిలోకి వస్తుంది? ఏ తేదిన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి? సమాయాన్ని పేర్కొనాల్సి ఉంటుం ది. ఈ మేరకు ఆ తేది సమయంలో అందుబా టులో ఉంటే స్లాట్‌ బుక్‌ అవుతుంది. దాని ప్రకా రం కొనుగోలు దారులు కార్యాలయానికి వెళ్తే.. రి జిస్ట్రేషన్‌ చేసిన రోజునే తహసీల్దార్లు అన్ని పత్రా లు పరిశీలించి మ్యూటేషన్‌ చేసి పాస్‌బుక్‌ కూ డా జారీ చేస్తారు.


ట్రయల్‌రన్‌ పూర్తి

దసరా నాటికి ధరణి పోర్టల్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చి భూముల రిజిస్ట్రేషన్‌ క్రయ, వి క్రయాలను కోనసాగించాలని ప్రభుత్వం మొద ట్లో నిర్ణయం తీసుకుంది. దీంతో తహసీల్దార్‌ కా ర్యాలయాల నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. అందులో భాగంగా గత వారంరోజుల క్రితం  కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌తో పాటు అదనపు కలెక్ట ర్‌ యాదిరెడ్డి కామారెడ్డి, దోమకొండ తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహి ంచి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అం దించారు. కానీ భారీ వర్షాలు, పంట నష్టంతో పా టు రాష్ట్ర రాజధాని వరదల కారణంగా మునగ డంతో ధరణి పోర్టల్‌ ప్రారంభంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ వచ్చింది. చివరకు ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ధరణి పోర్టల్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నతాధికా రులు నిర్ణయించారు.

Updated Date - 2020-10-24T11:18:16+05:30 IST