దారి చూపని ధరణి

ABN , First Publish Date - 2020-08-15T10:57:16+05:30 IST

జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనతో భూముల లెక్క పక్కాగా మారినా.. ఇంకా ఇబ్బందులు పూర్తిగా తొలగలేదు.

దారి చూపని ధరణి

రైతులకు నేటికీ తొలగని భూ సమస్యలు

రిజిస్ట్రేషన్‌శాఖతో అనుసంధానం కాని ధరణి వెబ్‌సైట్‌

తప్పులను సవరించుకునేందుకు నిత్యం 

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు


నిజామాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  

జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనతో భూముల లెక్క పక్కాగా మారినా.. ఇంకా ఇబ్బందులు పూర్తిగా తొలగలేదు. చిన్నచిన్న సమస్యలతో ఇప్పటికీ గ్రామాలలో కొద్ది మంది రైతులు నిత్యం తహసీల్దార్‌ కార్యాలయాల చు ట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధరణి వెబ్‌సైట్‌ను రిజిస్ట్రే షన్‌ శాఖతో అనుసంధానం చేయకపోవడంతో ఇబ్బం దులు తప్పడం లేదు. ఇప్పటికే కొత్తగా భూములు కొ నుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి మ్యూటేషన్‌ చేయించుకుంటే తప్ప పట్టా రావడం లేదు. ధరణి వెబ్‌సైట్‌ను రెవెన్యూ, రిజి స్ట్రేషన్‌ శాఖలతో అనుసంధానం చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రెండున్నరేళ్లు

గడిచిపోయింది. జిల్లాలో ని ఆయా గ్రామాల పరిధి లో ఏళ్ల తరబడి పెండింగ్‌ లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. అధికా రులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి ధరణిలో ఎంట్రీ చేశారు. రైతులకు ఉన్న వాస్తవ భూముల విస్తీ ర్ణం అనుకూలంగా కొత్త పట్టాలను ఇచ్చారు. తాతలు, తండ్రుల నాటి నుంచి వస్తున్న సమస్యలను తొలగించా రు. మొజార్టీ రైతుల సమస్యలు ఈ భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. జిల్లాలో కోర్టులో ఉన్న భూములకు మినహా అన్ని భూములకు పట్టాలను ఇచ్చారు. జిల్లాలో 2 లక్షల 61 వేల మందికి ఈ పట్టాలను మంజూరు చేశారు.


ఈ భూ రికార్డుల ప్రక్షాళనతో రైతుల భూ ములు పక్కాగా కావడంతో పా టు ప్రభుత్వ భూముల లెక్కలు తేలాయి. దేవాలయ, అటవీ భూములతో పాటు ఇతర శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలు పక్కాగా మారాయి. దేవాలయ పరిధిలోని భూములను ఆయా ఆలయాల పేరునే పహానీలను అందించారు. జిల్లాలోని దేవాదాయ శాఖ అధికారులు ఆ భూముల పహానీలను తీ సుకున్నారు. భవిష్యత్తులో ఈ ఆలయాల భూములు కబ్జా చేయకుండా ఏర్పాట్లు చేశారు. అటవీ భూముల ఉమ్మడి సర్వే ఇంకా పూర్తి కాకపోవడం వ ల్ల వాటి పరిష్కారం కాలేదు. జిల్లాలో సుమారు 35 వేల ఎకరాలకు పైగా ఈ భూ ములు ఉన్నాయి. వీటి లో కొన్నింటిని రై తులు సాగు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతు న్నారు. కొన్ని చోట్ల అటవీ అధికారులు కొన్ని భూముల ను స్వాధీనం చేసుకుని హరితహారం కింద మొక్కలు నాటారు. 


నేటికీ తప్పని ఇబ్బందులు

జిల్లాలో భూముల లెక్కలు భూప్రక్షాళనతో తేలినా ఇంకా సమస్యలు తగ్గడం లేదు. ఇప్పటికీ పట్టాలు పొం దిన వారు కూడా చిన్నచిన్న మార్పుల కోసం తహసీల్దా ర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ పనులు చేయాలని కోరుతున్నారు. భూప్రక్షాళన సమయంలో ఇంటి పేర్లు, ఆధార్‌లో ఉన్న పేర్లకు అనుగుణంగా కొం త మందివి వేయలేదు. వారు దరఖాస్తు చేసుకుంటే స వరిస్తున్నారు. కొంత మందివి భూముల విస్తీర్ణంలో తే డా ఉంది. వారు కూడా సవరించుకుంటున్నారు. ఇవి చి న్న సమస్యలే అయిన ఎక్కువ రోజులు తిరగాల్సి వస్తో ంది. భూప్రక్షాళన తర్వాత ధరణి వెబ్‌సైట్‌ వివరాలను రిజిస్రేషన్‌ శాఖకు అనుసంధానం చేయకపోవడం వల్ల కొత్తగా భూములు కొన్నవారు ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. వ్యవసాయ భూ ములను కొనుగోలు చేసిన వారు మొదట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.


ఆ తర్వాత ఆభూముల వివరాలను మీ-సేవకు వెళ్లి మళ్లీ మ్యూటేషన్‌ కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవా ల్సి వస్తోంది. ఆ తర్వాతనే మ్యూటేషన్‌ అవుతోంది. చా లా మండలాల్లోని వారు ఈ రెండు శాఖల అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆ తర్వాతనే భూములు మ్యూటేషన్‌ అయి కొన్న వారికి పట్టా చేతికి వస్తోంది. ధరణి వెబ్‌సైట్‌ వివరాలను రిజిస్ర్టేషన్‌ శాఖతో అను సంధానం చేస్తే ఇబ్బందులు తప్పేవి. రిజిస్ట్రేషన్‌ చేసిన భూముల వివరాలు నేరుగా సంబంధిత తహసీల్దార్‌కు వెళ్లేవి. భూముల పట్టాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా చేతికి వచ్చేవి. రాష్ట్ర స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రే షన్‌ కార్యాలయానికి అన్ని వివరాలు అందకపోవడం వల్ల కొన్ని వివాదాస్పద భూములు కూడా రిజిస్ట్రేషన్‌ అ వుతున్నాయి. దీంతో కొన్నవారు నష్టపోతున్నారు. ధరణి వెబ్‌సైట్‌ వివరాలు అనుసంధానం చేస్తే సమస్యలు తొ లగనున్నాయి. అధికారులు మాత్రం రైతులకు ఇబ్బందు లు లేకుండా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-08-15T10:57:16+05:30 IST