Abn logo
Sep 23 2021 @ 17:38PM

అమెరికా, బ్రిటన్‌ల కంటే యోగీనే గ్రేట్: కేంద్రమంత్రి

లఖ్‌నవూ: మేధో సామర్థ్యంలో అమెరికా, బ్రిటన్ దేశాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధిగమించారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల శాతమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.


‘‘ఒకప్పుడు ఒక్కో పాఠశాలలో 400 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక్కో పాఠశాలలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. దీనినే సంక్షేమ ప్రభుత్వం అంటారు. నాలుగున్నరేళ్ల పాలనలో అమెరికా, బ్రిటన్ దేశాల మేధో సామర్థ్యాన్ని యోగి అధిగమించారు. అభివృద్ధిలో కూడా రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. ఇక కొవిడ్ వ్యాక్సినేషన్‌లో దేశంలో ఎంతో ముందుంది. దేశం మొత్తం 80 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ వేస్తే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 8 కోట్ల వ్యాక్సినేషన్ జరిగింది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption