పాఠశాలల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-30T05:51:20+05:30 IST

పాఠశాలల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

పాఠశాలల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
డిప్యూటీ తహసీల్దార్‌ వహీదా రహమాన్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

 తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్‌ ధర్నా

ఉయ్యూరు, జూలై 29: ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులను అంగన్‌వాడీ కేంద్రాల్లో, 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.రాధిక డిమాండ్‌ చేశారు. విలీన నిర్ణయాన్ని ఉపసంహరణ, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, కంకిపాడు మండల శాఖల ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉయ్యూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాఠశాలల విలీన నిర్ణయాన్ని మానుకుని, సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, డీఏ బకాయిలు వెంటనే విడుదల చేసి, ప్రతినెల ఒకటో తేదీన  వేతనాలు ఇవ్వాలని, పాఠశాలల్లో   ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర ఖాళీలు వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ వహీదా రహమాన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఫెడరేషన్‌ రాష్ట్ర కౌన్సిలర్లు, వై.పరాత్పరి, నాగ సోమేశ్వరమ్మ, టీఎన్‌ఎం కోటేశ్వరరావు, వీరంకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T05:51:20+05:30 IST