Abn logo
Oct 29 2020 @ 23:04PM

జీతాలు చెల్లించాలని యానిమేటర్ల ధర్నా

ఆందోళన చేస్తున్న మెప్మా ఆర్పీలు, వెలుగు యానిమేటర్లుKaakateeya

ఏలూరు కలెక్టరేట్‌, అక్టోబరు 29 : బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని, వేధిం పులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతూ మెప్మా ఆర్పీలు, వెలుగు యానిమేటర్లు గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ శ్యామలరాణి, ఆర్పీల జిల్లా అధ్యక్షురాలు వెంకటరమణ, వీవోఏల జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి మాట్లాడారు. జిల్లాలోని ఆర్పీలకు 9 నెలలు, వెలుగు వీఏలకు  నాలుగు నెలలుగా బకాయి జీతాలు ఇవ్వాల్సి ఉందన్నారు. జీతాలు చెల్లించిన చోట కూడా గ్రేడింగ్‌ పేరుతో సగం మాత్రమే చెల్లించారన్నారు. దాదాపు వంద మందికి అసలు జీతాలే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య, కేవీపీఎస్‌ జిల్లా అధ్య క్షుడు రవీంద్ర, విజయలక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు మావూరి శ్రీనివాస్‌  , ఇందిరా రాణి, రమాదేవి, కల్యాణి, వెంకటరమణ, శేషారత్నం పాల్గొన్నారు. 


Advertisement
Advertisement