కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల ధర్నా

ABN , First Publish Date - 2020-05-31T11:04:50+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి అనుసంధానం గా పని చేస్తున్న రేషన్‌ డీలర్లకు కరోనా వైరస్‌ భారీన

కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల ధర్నా

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 30: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి అనుసంధానం గా పని చేస్తున్న రేషన్‌ డీలర్లకు కరోనా వైరస్‌ భారీన పడిన వారికి రూ.50లక్షలు ఇన్సూరెన్స్‌ అంద జేయాలని కోరుతూ అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న రెండు నెలల కమిషన్‌ను డీలర్లకు చెల్లించాలని శనివారం రేషన్‌ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సంధ్యారాణికి వినతి పత్రం అందించారు.


ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాంపెల్లి వేణుగోపాల్‌ మాట్లాడుతూ కోవిడ్‌ -19 వైరస్‌ ప్రభలుతున్న సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు రేషన్‌ డీలర్లు అండగా ఉన్నారని, భార్యా, పిల్లలు, కుటుంబాన్ని ఫనంగా పెట్టి నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. అయిన ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆరోపించారు. రేషన్‌ డీలర్లకు కూడా ఇన్సూరెన్స్‌ ప్రకటించాలని కోరారు. ఇందులో రేషన్‌ డీలర్ల సంఘం సభ్యులు, డీలర్లు వసంత్‌, వినోద్‌, వెంకటేష్‌, విలాస్‌, అడెల్లు, కిషన్‌, శ్రీనివాస్‌, తదితరులున్నారు.  

Updated Date - 2020-05-31T11:04:50+05:30 IST