Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్సెంటివ్‌ పెంపు కోరుతూ ధర్నా

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 30: స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉద్యోగులకు ఇన్సెంటివ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విభాగం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత పద్ధతిలో ఇన్సెంటివ్‌ ఇవ్వాలని, ఫర్నేస్‌లో లోపాలను సరిచేయాలని, ఫర్నేస్‌లు నిరంతరం నడిపేందుకు అవసరమైన ముడి సరకును అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మరమ్మతులు వస్తే అందుకు అవసరమైన విడిభాగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం విభాగాధిపతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జె.రామకృష్ణ, ఎం.రవి, బాలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement