Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చాలని ధర్నా’

గొలుగొండ, నవంబరు 29 : మండలంలోని గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆది వాసీ హక్కుల సాధన సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు నల్లి కళ్యాణం మాట్లాడుతూ ఈ ప్రాంత గిరిజను లను ఐటీడీఏలో విలీనం చేయకపోవడం వల్ల అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. వెంటనే గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక ప్రతినిధి బొట్టా నాగరాజు, మండల నాన్‌ షెడ్యూల్‌ సంఘం అధ్య క్షుడు ఎన్‌.చిరంజీవి, సీపీఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement