నూతన వేతనాలు చెల్లించాలని ధర్నా

ABN , First Publish Date - 2022-01-29T05:59:02+05:30 IST

ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు చెల్లించే వరకు పోరాటాలు చేస్తామని గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ అన్నారు. నూతన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ప్లాంట్‌ ఈడీ(వర్క్స్‌) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

నూతన వేతనాలు చెల్లించాలని ధర్నా
ఈడీ(వర్క్స్‌) కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 28: ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు చెల్లించే వరకు పోరాటాలు చేస్తామని గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ అన్నారు. నూతన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ప్లాంట్‌ ఈడీ(వర్క్స్‌) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.790 కోట్లు లాభాలు వచ్చాయని సీఎండీ ప్రకటించారని, ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయడం ద్వారా రూ. 15 కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందన్నారు. ఇంటక్‌ అధ్యక్షుడు గంధం వెంకటరావు మాట్లాడుతూ కార్మికులు తీవ్ర నిరాశతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైటీ .దాసు, సుబ్బయ్య, మసేన్‌రావు, జి.గణపతిరెడ్డి, రాధాకృష్ణ, బొడ్డు పైడిరాజు, జీఆర్‌కే నాయుడు, సీహెచ్‌.సన్యాసిరావు, దాసరి సురేశ్‌ బాబు, వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T05:59:02+05:30 IST