Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ధర్నా

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6: రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, ప్రెటోల్‌ పై వ్యాట్‌ తగ్గించాలని కోరుతూ జిల్లా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ కార్యాలయం ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ధరలు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. నాయకులు సత్యనారాయణ, విశాల్‌, బాలకృష్ణ, తిరుపతి, కిరణ్‌కుమార్‌ ప్రవీణ్‌, పవన్‌, నాగభూషన్‌, తిరుపతి మల్లయ్య, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement