న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్.. దివాలా ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు పిరామల్ గ్రూప్ సమర్పించిన బిడ్‌ను రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. మొత్తం రుణదాతల్లో 94 శాతం మంది పిరామల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీసీహెచ్‌ఎఫ్ఎల్) బిడ్‌కు ఓటేశారు. దీంతో ఈ దివాలా ప్రక్రియ పరిష్కారం ద్వారా బ్యాంకర్లకు రూ.35,000 కోట్ల నుంచి రూ.37,000 కోట్ల బకాయిలు వసూలు కానున్నాయి.