డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కేసులో కొత్త మలుపు

ABN , First Publish Date - 2020-10-20T05:35:21+05:30 IST

వాలా పరిష్కార చర్య లు ఎదుర్కొంటున్న తొలి ఆర్థిక సేవ ల సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) కేసు కొత్త మలుపు తీసుకుంది. కంపెనీ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌.. రుణదాతల బకాయిలు చెల్లించేందుకు వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను ఆఫర్‌ చేశారు....

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కేసులో కొత్త మలుపు

రుణదాతలకు రూ.43,000 కోట్ల ఆస్తులు ఆఫర్‌ చేసిన ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌ 


న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్య లు ఎదుర్కొంటున్న తొలి ఆర్థిక సేవ ల సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) కేసు కొత్త మలుపు తీసుకుంది. కంపెనీ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌.. రుణదాతల బకాయిలు చెల్లించేందుకు వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను ఆఫర్‌ చేశారు. వాటి విలువ రూ.43,000 కోట్లు పైనే ఉంటుందన్నారు. దివాలా పరిష్కార చర్యల్లో కంపెనీ ఆస్తులకు గరిష్ఠ విలువ లభించేందుకు దోహదపడాలని ఈ ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ కార్యకలాపాల పర్యవేక్షణకు ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ ఆర్‌ సుబ్రమణ్య కుమార్‌కు ఈ నెల 17న రాసిన లేఖలో వాద్వాన్‌ ఈ ఆఫర్‌ చేశారు.


కంపెనీ ఆస్తుల విలువను వీలైనంతగా పెంచడంతోపాటు సరైన, సమగ్ర పరిష్కారం లభించేందుకు పలు రియల్టీ ప్రాజెక్టుల్లో తన కుటుంబానికి ఉన్న వాటాల యాజమాన్య హక్కులను బదిలీ చేసేందుకు సిద్ధమని వాద్వాన్‌ తెలిపారు. ఈ జాబితాలోని జుహూ గల్లీ ప్రాజెక్ట్‌, ఇర్లా ప్రాజెక్ట్‌ సహా పలు ఆస్తుల విలువ రూ.43,879 కోట్లు ఉంటుందని వాద్వాన్‌ లేఖ లో పేర్కొన్నారు. వీటి విలువను మార్కెట్‌ రేటు కంటే 15 శాతం తక్కువగానే లెక్కగట్టినట్లు   స్ప ష్టం చేశారు. 2018 సెప్టెంబరు లో వెలుగుచూసిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ప్రభావంతో డీహెచ్‌ఎ్‌ఫఎల్‌తో సహా ఎన్‌బీఎ ఫ్‌సీలన్నీ ఆర్థిక సంకటంలో చిక్కుకున్నాయన్నారు. అయినప్పటికీ, గ్రూప్‌ ఆస్తులైన ఆధార్‌ హౌ సింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అవన్సే ఫైనాన్షియల్స్‌, డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రామెరికా అసె ట్‌ మేనేజర్స్‌, డీఎ్‌ఫహెచ్‌ఎల్‌ ప్రామెరికా ట్రస్టీ లిమిటెడ్‌ను విక్రయించడం ద్వారా రూ.44,000 కోట్ల బకాయిలను తిరిగి చెల్లించామన్నారు.


జుడీషియల్‌ కస్టడీలో ప్రమోటర్లు 

ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్లు కపిల్‌ వాద్వాన్‌, ధీరజ్‌ వాద్వాన్‌ ప్రస్తుతం జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. వీరిని ముంబై శివారులోని తలోజా జైళ్లో ఉంచారు. ట్రాన్సాక్షన్‌ ఆడిటర్‌ గ్రాంట్‌ ఽథోర్టన్‌ రిపోర్టు ప్రకారం.. 2006-07 నుంచి 2018-19 మధ్యకాలంలో డీహెచ్‌ఎ్‌ఫఎల్‌లో రూ.17,394 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. ప్రమోటర్లు నిధుల మళ్లింపునకు పాల్పడటంతో రుణదాతలు ఈ కంపె నీ ఖాతాను మోసాల పద్దులో చేర్చారు. 


రుణదాతలకు రూ.65,000 కోట్ల గండి 

డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ను టేకోవర్‌ చేసేందుకు పోటీపడుతున్న నలుగురిలో ఓక్‌ట్రీ ఒక్కటే కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు రూ.20,000 కోట్లకు బిడ్‌ వేసింది. ఎస్‌బీఐ సహా పలు బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ చెల్లించాల్సిన మొత్తం బకాయిల భారం రూ.95,000 కోట్లు. కంపెనీ చేతిలోనున్న రూ.10,000 కోట్ల నగదు, ఓక్‌ట్రీ ఆఫర్‌ చేసిన రూ.20,000 కోట్లు కలిపితే రుణదాతలకు వసూలయ్యేది రూ.30 వేల కోట్లే. అంటే, రుణదాతలు రూ.65,000 కోట్లు నష్టపోవాల్సి రావచ్చు. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌కు చెందిన రూ.40 వేల కోట్ల హోల్‌సేల్‌ అండ్‌ స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) పోర్ట్‌ఫోలియో కోసం అదానీ గ్రూప్‌ రూ.3,000 కోట్లకు బిడ్‌ వేసింది. కాగా, డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ రిటైల్‌ పోర్ట్‌ఫోలియో కోసం పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పోటీపడుతోంది. రూ.12,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు బిడ్‌ సమర్పించింది. ఇక ఎస్‌సీ లోవీ బిడ్‌లో పేర్కొన్న షరతులను రుణదాతలు ఆమోదించే అవకాశాల్లేవని సమాచారం. ఈ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రూ.60,000 కోట్ల మేర బకాయిలను రద్దు చేసుకోవాల్సి రావచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. 


అదానీ, పిరమాల్‌ ఆసక్తి  

డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ఆస్తులను చేజిక్కించుకునేందుకు అదానీ, పిరమాల్‌ గ్రూప్‌ పోటీపడుతున్నాయి. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా గతవారం 4 బిడ్లు దాఖలయ్యాయి. అదానీ, పిరమాల్‌తోపాటు అమెరికాకు చెందిన ఓక్‌ట్రీ, హాంకాంగ్‌కు చెందిన ఎస్‌సీ లోవీ ఈ బిడ్లు సమర్పించాయి. గత ఏడాది నవంబరులో ఆర్‌బీఐ   డీహెచ్‌ఎ్‌ఫఎల్‌పై దివాలా చర్యలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-10-20T05:35:21+05:30 IST