దివ్యాంగుల్లో ధైర్యం నింపాలి

ABN , First Publish Date - 2021-12-04T06:29:05+05:30 IST

దివ్యాంగుల్లో ధైర్యం నింపాలి

దివ్యాంగుల్లో ధైర్యం నింపాలి
ఉయ్యూరులో బాలల చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి

ఉయ్యూరు, డిసెంబరు 3 : దివ్యాంగ బాలల్లో మనోథైర్యం నింపాలని ఉయ్యూరు జడ్పీ హైసూల్‌  హెచ్‌ఎం   పీవీఎస్‌ఎన్‌ శారద అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్క రించుకుని స్థానిక భవిత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  పాఠశాల హెచ్‌ఎం రమాదేవి,  తారానాథ్‌, పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎన్‌.రామమ్‌ రూ. 6వేల విలువ చేసే  కుర్చీలు బహూకరించారు. భవిత కేంద్రం అధికారి గీత కృతజ్ఞతలు తెలిపారు.

బాలలకు చట్టాలపై అవగాహన

  శిరీషా రీహేబిలిటేషన్‌ సెంటర్‌లో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉయ్యూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.బేబీ రాణి పాల్గొని దివ్యాంగ బాలలకు చట్టాలపై అవగాహన కల్పిం చారు. రీహేబిలిటేషన్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ రాజేష్‌, న్యాయవాదులు టి.చంటిబాబు, నాగేశ్వరరావు, ప్రతాప్‌కుమార్‌, ధనలక్ష్మి పాల్గొన్నారు. సెంటర్‌లోని బాలలకు ప్రపంచ దివ్యాంగ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

భారంగా కాకుండా బాధ్యతగా చూడాలి

కంకిపాడు : దివ్యాంగులను భారంగా కాకుండా బాధ్యతగా చూడాలని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ అన్నారు. కంకిపాడు భవిత కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బాకి రమణ, ఉపసర్పంచ్‌ రాచూరి చిరంజీవి, ఎంపీటీసీ సభ్యురాలు కంకిపాటి పద్మావతి, రిసోర్స్‌ టీచర్‌ దీప్తి తదితరులు పాల్గొన్నారు. 

ఆత్మస్థైర్మమే అన్నిటికీ మార్గం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : ఆత్మస్థైర్మంతో ముందడుగేస్తే దివ్యాంగులు కూడా అన్నింటా ముందుకు దూసుకుపోగలరని, ఆత్మస్థైర్మంమే అన్నింటికీ మార్గం చూపుతుందని సర్పంచ్‌ పిల్లా అనిత సూచించారు. వీరవల్లి ఎంపీపీ స్కూల్‌ భవిత కేంద్రంలో శుక్రవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. వకృత్తం, పాటలు లాంటి వివిధ అంశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులు కె.సుశీల, జె. నాగమణి, సీఆర్‌పీ వేళాంగినిమాత పర్యవేక్షణలో దివ్యాంగ విద్యార్థుకు పోటీలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నిర్మిల, మాజీ సర్పంచ్‌ పిల్లా రామారావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ అంజిబాబు, ఉపాధ్యాయులు అంజనాదేవి పాల్గొన్నారు.

దివ్యాంగులను ఆదరించటం మానవ ధర్మం

గన్నవరం : దివ్యాంగులను ఆదరించటం మానవ ధర్మమని రిటైర్డ్‌ అధ్యాపకులు గన్నే వెంకట్రావు అన్నారు. దావాజీగూడెం స్పందన మానసిక వికాస కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.   రిటైర్డ్‌ ఎంఈవో జయబాబు, నేషనల్‌ రైట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ పి.బుజ్జిబాబు, ఎంపీపీ పాఠశాలల హెచ్‌ఎంలు దాసరి నవభారతి, జాస్తి విజయ, పాస్టర్‌ జి.సురేష్‌బాబు, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొసైటీ చైర్మన్‌ సంకాబత్తుల వెంకట్‌, కార్యదర్శి రజిత, దామెర సీతారామయ్య  పాల్గొన్నారు. గన్నవరం భవిత కేంద్రంలో  అంతర్జాతీయ దివ్యాంగుల దినో త్సవం నిర్వహించారు. ఎంపీపీ అనగాని రవి, జడ్పీటీసీ అన్న వరపు ఎలిజబెత్‌ రాణి, సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య, ఎంఈవో ఆదూరి వెంకటరత్నం, పాలడుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నాగవరప్పాడులో...

ఉంగుటూరు : దివ్యాంగులు చైతన్యదివిటీల వంటివారని ఎంపీపీ పులపాక ప్రసన్నలక్ష్మి అన్నారు.  నాగవరప్పాడులోని మండల భవిత కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఉంగుటూరు జడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం అట్లూరి ప్రభాకరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఆసక్తివున్న రంగాల్లో శిక్షణ ఇస్తే సమాజంలో తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతారని తెలిపారు.  వెల్దిపాడు జడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం ఎన్‌.ఉష, ఉంగుటూరు, నాగవరప్పాడు, వెల్దిపాడు ఎంపీపీ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T06:29:05+05:30 IST