Abn logo
Aug 9 2020 @ 23:01PM

ధోనీది అద్భుతమైన క్రికెట్ బుర్ర.. మాజీ అంపైర్ ప్రశంస!

కాన్‌బెర్రా: భారతజట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ అంపైర్ సైమన్ టాఫెల్ ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్‌లో చూసిన అద్భుతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడని టాఫెల్ చెప్పాడు. ధోనీది వద్ద అద్భుతమైన క్రికెటిగ్ బుర్ర ఉందని మెచ్చుకున్నాడు. ‘ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆవేశం చూపించడు. అంతేకాదు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఇలాంటి హాస్య చతురత ఉన్న ఆటగాళ్లు చాలా అరుదు’ అని టాఫెల్ పేర్కొన్నాడు. 49 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ మాజీ అంపైర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.

Advertisement
Advertisement
Advertisement