ఆటతో అందర్నీ కట్టిపడేస్తాడు.. ధోనీపై డీన్ జోన్స్ ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-08-06T04:14:36+05:30 IST

భారతజట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ డీన్ జోన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆటతో అందర్నీ కట్టిపడేస్తాడు.. ధోనీపై డీన్ జోన్స్ ప్రశంసలు!

కాన్‌బెర్రా: భారతజట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ డీన్ జోన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ గొప్ప బ్యాట్స్‌మెన్ అని, అంతకు మించి గొప్ప ఎంటర్‌టైనర్ అని జోన్స్ చెప్పాడు. ‘ఆటతీరుతో అందర్నీ కట్టిపడేసే సత్తా ధోనీ సొంతం. అతని గురించి దేశాధ్యక్షులు, ప్రధానులు చర్చించుకుంటారు. అతను అంత గొప్ప ఆటగాడు’ అని జోన్స్ పేర్కొన్నాడు. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్నీ చేసే సత్తా ధోనీకి ఉందని, అందుకే అతనంటే అందరికీ ఇష్టమని తెలిపాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ అద్భుతంగా రాణించాలని కోరుకున్న జోన్స్.. అతని ఆట చూడటం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Updated Date - 2020-08-06T04:14:36+05:30 IST