విరాట్‌ను వద్దన్న మహీ!

ABN , First Publish Date - 2020-04-04T09:39:21+05:30 IST

దశాబ్ద కాలంగా టీమిండియాకు ధోనీ, విరాట్‌ కోహ్లీ వెన్నుముకగా ఉన్నారు. మహీ కెప్టెన్సీలోనే శ్రీలంక (2008) టూర్‌లో కోహ్లీ వన్డే అరంగేట్రం చేశాడు...

విరాట్‌ను వద్దన్న మహీ!

ముంబై: దశాబ్ద కాలంగా టీమిండియాకు ధోనీ, విరాట్‌ కోహ్లీ వెన్నుముకగా ఉన్నారు. మహీ కెప్టెన్సీలోనే శ్రీలంక (2008) టూర్‌లో కోహ్లీ వన్డే అరంగేట్రం చేశాడు. అద్భుత నైపుణ్యం కలిగిన కోహ్లీని సారథిగా మలచడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. అయితే, 2008 అండ ర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ విరాట్‌ను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయడానికి సారథి ధోనీ ససేమిరా అన్నట్టు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ తెలిపాడు. ‘నైపుణ్యం కలిగిన టీనేజర్‌ కోహ్లీని టీమిండియాకు ఎంపిక చేయాలని నేను అనుకున్నా. అయితే, ధోనీ, అప్పటి బీసీసీఐ చైర్మన్‌ శ్రీనివాసన్‌ దీనికి తొలుత ఒప్పుకోలేదు. కోహ్లీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని నాతో పాటు సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో అతడు జట్టులోకి వచ్చాడు. ఆ టూర్‌లోనే విరాట్‌ వన్డే అరంగేట్రం చేసి అనతి కాలంలోనే కీలక ఆటగాడిగా మారాడు’ అని వెంగ్‌సర్కార్‌ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-04-04T09:39:21+05:30 IST