May 5 2021 @ 08:06AM

పనోరమకు 'దృశ్యం-2'

ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ 'దృశ్యం 2' హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్.. పనోరమ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్ర హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి అభిరుచి గల నిర్మాతల నుంచి హిందీలో దృశ్యం 2 రాబోతుండటం వల్ల కథ చాలామంది ప్రేక్షకులకి దగ్గరవుతుంది అని తెలిపాడు. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజై సూపర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమాలో మోహనల్ లాల్ - మీనా నటించగా నటించారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అదే పేరుతో రూపొందుతోంది. వెంకటేశ్ - మీనా జంటగా.. నదియా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతోంది. కాగా హిందీ రీమేక్‌లో నటీ నటులు..దర్శకుడెవరనే విషయం త్వరలో వెల్లడి కానుందని సమాచారం. మొదటి భాగంలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్ నటించిన సంగతి తెలిసిందే.