రిమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ధ్యానచంద్ర బాధ్యతలు

ABN , First Publish Date - 2021-10-22T05:30:00+05:30 IST

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) అడ్మినిస్ర్టేటర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) హెచ్‌ఎం ధ్యానచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

రిమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ధ్యానచంద్ర బాధ్యతలు
ఆసుపత్రిని పరిశీలిస్తున్న జేసీ ధ్యానచంద్ర తదితరులు

కడప(సెవెన్‌రోడ్స్‌), అక్టోబరు 22:  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) అడ్మినిస్ర్టేటర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) హెచ్‌ఎం ధ్యానచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాధిపతులు, సూపరింటెండెంట్‌, సీఎ్‌సఆర్‌ఎంవో, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవోలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌), నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జీఆర్‌.ఐ, ఈఈ ఏపీఎంఎ్‌సఐడీసీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఐపీ, ఓపీ, గైనిక్‌ విభాగంలోని ప్రతి గదిని సందర్శించారు. అలాగే డయాలసిస్‌ యూనిట్‌ మొదలైనవి తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రసాద్‌రావు, వివిధ విభాగాల వైద్యాధికారులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:30:00+05:30 IST