డయల్‌ 100కు పెరుగుతున్న ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-09-21T04:37:34+05:30 IST

జిల్లాలో డయల్‌ 100కు ఫిర్యాదులు క్రమంగా పెరుగుతు న్నాయి.

డయల్‌ 100కు పెరుగుతున్న ఫిర్యాదులు
డయల్‌ 100పై అవగాహనకల్పిస్తున్న మక్తల్‌ సీఐ సీతయ్య (ఫైల్‌)

- ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 6,873 ఫిర్యాదులు

నారాయణపేట క్రైం, సెప్టెంబరు 20 : జిల్లాలో డయల్‌ 100కు ఫిర్యాదులు క్రమంగా పెరుగుతు న్నాయి. అత్యవసర సమయంలో ప్రజలు డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని పోలీస్‌శాఖ గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఎక్కువగా గ్రామాల నుంచే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న పరిస్థి తులు కనిపిస్తున్నాయి. ఫిర్యాదు అందిన 10 నిమి షాల్లోనే ఘటనా స్థలాలకు వెళ్లేలా పోలీస్‌శాఖ ముందుకు సాగుతోంది. భార్యాభర్తల మధ్య తలెత్తి న వివాదాలతో దాడులకు దిగడం, గ్రామ స్థాయిలో చోటుచేసుకునే అల్లర్లు, అక్రమ వ్యాపారాల నిల్వలు, రవాణా, రోడ్డు ప్రమాదాల వ్యక్తులపై దాడుల వంటి అంశాల్లో డయల్‌ 100కు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీస్‌ సిబ్బంది ఎవరైన డయల్‌ 100కు సమాచారం అందించిన వారి వివరాలు బహిర్గతం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెబుతున్నారు. అవసరమైతే డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదులపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిని కాపాడుతూ..

కొంతమంది కుటుంబ కలహాలు, అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ వీడియోకాల్‌ ద్వారా తెలియజేసిన సమయంలో బాధిత కుటుంబీకుల నుంచి వెంటనే డయల్‌ 100కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమయంలో డయల్‌ 100 సిబ్బంది, పెట్రోలింగ్‌ పోలీసులు అప్రమత్తమై ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా ఆత్మహత్యకు పాల్పడిన వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి కౌన్సెలింగ్‌ ఇచ్చిన సంఘటనలు పోలీస్‌ శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నాయి. 

జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్‌లో కారులో వెళ్తున్న వారిని కొంతమంది వ్యక్తులు ఏ కారణంగా లేకుండా దాడి చేయడంతో బాధితుల్లో ఒకరు డయల్‌ 100కు ఫిర్యాదు చేయగా హుటాహుటినా డీఎస్పీ సత్యనారాయణతో పాటు ఎస్‌ఐ, డయల్‌ 100 టీం  ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ురికల్‌ మండలానికి బతుకుదెరువుకు వచ్చిన ఓ వలస కార్మికుడు కుటుంబ కలహాలతో శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసు కునేందుకు వెళ్లి భార్యకు వీడియో కాల్‌ చేశారు. బాధితురాలు డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని కాపాడారు.  

Updated Date - 2022-09-21T04:37:34+05:30 IST