12,638 వజ్రాలతో ప్రత్యేకమైన ఉంగరం... స్వర్ణకారుని వరల్డ్ రికార్డు!

ABN , First Publish Date - 2020-12-05T15:10:19+05:30 IST

అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో కనిపిస్తున్నఈ డైమండ్ రింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో...

12,638 వజ్రాలతో ప్రత్యేకమైన ఉంగరం... స్వర్ణకారుని వరల్డ్ రికార్డు!

న్యూఢిల్లీ: అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో కనిపిస్తున్నఈ డైమండ్ రింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఏకంగా 12,638 చిన్నసైజు వజ్రాలను అందంగా పొదుగుతూ ఈ ఉంగరాన్ని రూపొందించారు. దీనిని తయారుచేసిన స్వర్ణకారుడు ఈ డైమండ్ రింగ్‌కు ‘మేరీ గోల్డ్’ అని పేరు పెట్టారు. దీని బరువు 165 గ్రాములు. దీనిని విక్రయించబోనని సదరు స్వర్ణకారుడు తెలిపాడు. 


ఈ డైమండ్ రింగ్‌ను ఒక భారతీయుడు రూపొందించాడు. 25 ఏళ్ల హర్షిత్ బన్సల్ ఈ ఉంగరాన్ని తయారు చేశాడు. ఈ సందర్భంగా హర్షిత్ మాట్లాడుతూ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ ఉంగరాన్ని అత్యంత సులభంగా ధరించవచ్చని, తాను రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో జ్యూయలరీ డిజైనింగ్ కోర్సు చేస్తున్నప్పుడు తనకు ఇటువంటి ఐడియా వచ్చిందని తెలిపారు. 10 వేలకు మించిన వజ్రాలతో రింగ్ రూపొందించాలన్న తనకల నెరవేరిందన్నారు. ఈ అద్భుతమైన ఉంగరాన్నితన వద్దనే ఉంచుకుంటానని, దీనిని ఎవరికీ అమ్మబోనని తెలిపారు. 

Updated Date - 2020-12-05T15:10:19+05:30 IST