గుడివాడ కుర్రాడికి డయానా పురస్కారం!

ABN , First Publish Date - 2020-07-10T09:23:46+05:30 IST

సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేసిన యువతకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘డయానా ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ రోల్‌ ఆఫ్‌

గుడివాడ కుర్రాడికి డయానా పురస్కారం!

గుడివాడ, జులై 9: సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేసిన యువతకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘డయానా ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ రోల్‌ ఆఫ్‌ హానర్‌’ పురస్కారం కృష్ణా జిల్లా గుడివాడ యువకుడు గోళ్ల పృధ్వీకి దక్కింది. గౌరీశంకరపురానికి చెందిన సుబ్రహ్మణ్యం, లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు పృధ్వీ భారత్‌లో బాలల అభ్యున్నతికి దోహద పడినందుకుగానూ ఈ అవార్డు లభించింది. గుడివాడ మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం పాఠశాల.. విభిన్న రంగాల్లో పృధ్వీ చేసిన కృషిని వివరిస్తూ బ్రిటన్‌లోని ప్రిన్సెస్‌ డయానా ఫౌండేషన్‌కు నామినేషన్‌ పంపింది. ఇలా వచ్చిన నామినేషన్లలో భారత్‌ నుంచి 23 మంది అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పృధ్వీ ఒక్కడికే చోటు దక్కగా.. తెలంగాణ నుంచి నలుగురు అవార్డు అందుకున్నారు. లండన్‌ నుంచి ఈ నెల 1న నిర్వహించిన వర్చువల్‌ వేడుకలో పురస్కార గ్రహీతలకు ప్రిన్సెస్‌ డయానా భర్త ప్రిన్స్‌ చార్లెస్‌, తనయులు విలియం, హ్యారీ సమక్షంలో అవార్డులు అందజేశారు.

Updated Date - 2020-07-10T09:23:46+05:30 IST